గణేశ ధ్యానం – చిన్న సమస్యలకు పెద్ద పరిష్కారం
అమ్మమ్మ – లలిత సంభాషణ
లలిత: “అమ్మమ్మ, నా గోల్డ్ రింగ్ ఎక్కడో పెట్టాను… ఎంత వెతికినా కనబడటం లేదు. నువ్వూ చూస్తావా?”
అమ్మమ్మ:“సరే అమ్మా, చూద్దాం. నువ్వు ఆ టేబుల్ పై ఉన్న పుస్తకాల దగ్గర చూడి, నేను ఈ బీరువా వైపు చూస్తాను.”
ఇద్దరూ చాలాసేపు వెతికినా దొరకలేదు.అమ్మమ్మ అప్పుడు మెల్లగా చెప్పింది:“లలిత, ఒకసారి గణేశుడిని తలుచుకుని, మనసు ప్రశాంతంగా పెట్టుకుని మళ్లీ వెతుకు.”
లలిత:“అమ్మమ్మ, గణేశుడిని తలుచుకుంటే నిజంగానే దొరుకుతుందా?”
అమ్మమ్మ ముద్దుగా నవ్వుతూ:“నాకు ఎప్పట్నుంచో అలవాటు అమ్మా… ఏది దొరకకపోయినా గణనాథుడిని ధ్యానిస్తే మనసు సర్దిపోతుంది. ఆ ప్రశాంతతతో వెతికితే వెంటనే దొరికిపోతుంది.”
లలిత కూడా ఓపికగా కూర్చొని గణేశుడిని తలుచుకుంది.
తర్వాత హ్యాండ్‌బ్యాగ్‌ని మళ్లీ చూడగానే—రింగ్ అక్కడే ఉంది!
లలిత:“అమ్మమ్మ! ఇక్కడే ఉంది! అంతసేపు కనిపించలేదు, ఇప్పుడు వెంటనే కనబడింది! ఇది ఎలా?”
అమ్మమ్మ చెప్పిన చిన్న పురాణ కథ:
పురాణాలలో గణేశుడి చిన్న కథ ఉంది చెప్తాను విను....
ఒకసారి వ్యాసమహర్షి మహాభారతం రచించడానికి సిద్ధమయ్యారు.
అంత పెద్ద గ్రంథం వ్రాయడానికి ఎంతో శ్రద్ధ, ధ్యానం, సహనం ఉన్న దేవుడు కావాలి అనుకున్నారు.అప్పుడు గణేశుడిని ప్రార్థించారు.
గణేశుడు సమ్మతించి, గౌరవంగా ఇలా చెప్పారు: అలా అయితే ఒక శరతు మీరు ఎప్పుడు చెప్పడం ఆపకూడదు అలా అయితే నేను రాయడానికి ఒప్పుకుంటాను
వ్యాసుడు కూడా అన్నారు:‘అయితే మీరు రాసేప్రతి మాటకు అర్ధం పూర్తిగా తెలుసుకొని రాయాలి.’
ఇలా ఇద్దరూ పని మొదలుపెట్టారు.
మధ్య మధ్యలో చిన్న చిన్న అడ్డంకులు వచ్చేవి—
కలం సడన్‌గా నాసిరకమైపోవడం, పదాలు గజిబిజిగా అనిపించడం, మనసు తడబడడం…
అప్పుడు వ్యాసుడు ఒక్క క్షణం గణేశుడిని మనసులో ధ్యానించేవారు.
అంతే… ఆ విఘ్నాలు తొలగిపోయి పని మళ్లీ సజావుగా సాగేది.
అందుకే ఆయనను ‘విఘ్న వినాయకుడు’ అంటారు.”
అమ్మమ్మ ముగింపు మాట:
“మనం హడావిడిగా ఉంటే మనం చూడాల్సినవే కనిపించవు అమ్మా…గణేశుడిని తలుచుకుంటే మనసు నెమ్మదిస్తుంది. మనసు నెమ్మదిస్తే…పోయినవి దొరుకుతాయి, పనులు సులభమవుతాయి, అడ్డంకులు తగ్గిపోతాయి.”
లలిత ముద్దుగా నవ్వి అమ్మమ్మను హత్తుకుంది.

Comments
Post a Comment